మీకు దక్కినన్ని పదవులు పార్టీలో ఎవరికీ దక్కలేదు-పల్లా

Google+ Pinterest LinkedIn Tumblr +

వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఒక మంత్రి పదవిలో ఉండి చట్టాన్ని ఉల్లఘించి దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలకు పాల్పడుతున్న బీజేపీలో చేరే ముందు ఒకసారి ప్రశ్నించుకోవాలని ఈటలకు పల్లా సూచించారు.

ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. ఈ క్రమంలోనే కులాల మధ్య కుంపట్లు పెట్టే ఆలోచనలు మానుకోవాలని తెలిపారు. ఇక నిరంతరం ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఈటలకు ఇబ్బంది కాకుండా చూశారని పల్లా తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో మీకు దక్కినన్ని పదవులు మరెవరికీ దక్కలేదని ఈటలను ఉద్దేశించి పల్లా వ్యాఖ్యానించారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: