ఈసీఐకు చేరిన షర్మిల కొత్త పార్టీ దరఖాస్తు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎట్టకేలకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఎన్నికల సంఘానికి చేరింది. హైదరాబాద్‌కు చెందిన వాడుక రాజగోపాల్‌ ఈసీఐకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుపై ఈ నెల 16వ తేదీలోగా వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. చాలా రోజులుగా షర్మీల పార్టీ పెడుతున్నారంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో షర్మిల పార్టీలోకి చాలా మంది నేతలు వస్తారంటూ ఆమే వర్గం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆమే చెంతకు చేరారు సింగర్ ఏపూరి సోమన్న

Share.

Comments are closed.

%d bloggers like this: