ఈటలపై గువ్వల బాలరాజు ఫైర్

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించటంతో వరుసగా ఆ పార్టీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం పెదవి విప్పారు. తన వ్యక్తిగతమైన ఆస్తులను రక్షించుకోవటానికి ఈటల ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ విమర్శించారు. ఇక ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఆయనను కాపాడలేరన్నారు. ఈటల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, బడుగు బలహీనవర్గాలు విశ్వసించరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్టనివ్వలేదంటూ అసత్యఆరోపణలు చేస్తున్నారని గువ్వల బాల్ రాజ్ దుయ్యబట్టారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: