ఈటల చేరికపై స్పందించిన రాజాసింగ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ బీజేపీలోకి ఈటల రాక పట్ల స్పందించారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తనదైన రీతిలో స్పందిస్తూ. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో స్థానం లేదన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలా మంది చేరబోతున్నారంటూ జోస్యం చెప్పారు. ఇక బీజేపీ ఎవరికో చెందిన పార్టీ కాదని, పార్టీ చేరికలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ఇక ఈటల బీజేపీలోకి వస్తే పార్టీ బలపడుతుందని ఆయన అన్నారు. ఇక చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లే నష్టపోతారని రాజాసింగ్ తెలిపారు. ఈటల బీసీలో ఉన్న బలమైన నేత అని ఆయన రాక పట్ల పార్టీ బలపడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల బీజేపీలోకి చేరుతున్నారనే వార్త పట్ల అప్రమత్తమైన టీఆర్ఎస్ నేతలు వరుసగా మండిపడుతున్నారు. తాజాగా గువ్వల బాలరాజ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: