వాయిదా పడ్డా ఆకాశవాణి చిత్రం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆకాశవాణి చిత్రం తాజాగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, మన కోన పాట అనే పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు  తెరకెక్కిస్తుండగా ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు.

జూన్ 4న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ టెస్టింగ్ టైంలో అందరు ఇంట్లో ఉంటూ సేఫ్‌గా ఉండటమే ముఖ్యమని విడుదల తేదీని మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు చిత్ర మేకర్స్.

Share.

Comments are closed.

%d bloggers like this: