మళ్లీ సొంతగూటికి టీఎంసీ నేతలు?

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ తిరిగి విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే బీజేపీలో చేరిన కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేలు తిరిగి మళ్లీ సొంతగూటికి చేరాలనే ఆలోచనలలో ఉన్నట్లు సమాచారం. సొంత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరిన చాలామంది నేతలు మమతా పార్టీ వైపు కొంచం ఆశగా చూస్తున్నారట. దీపేందు బిస్వాస్, సోనాలిగుహాతో సహా పలువురు మాజీ టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సారి ఎలాగైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని వెళ్లిన చాలామంది నేతలకు నిరాశే ఎదురైంది. దీంతో వారు ఎలాగైనా సొంత గూటికే వెళ్లాలని తమలో తాము చర్చించకుంటున్నారట. ఇక ఏకంగా 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మమతా పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. దీనిపై కొంతమంది టీఎంసీ నేతలు మాత్రం పార్టీ నుంచి వెళ్లిన వారు మళ్లీ వస్తే పార్టీ చేర్చుకోదు అంటూ చెబుతున్నారట. ఇక మొత్తాని మళ్లీ చేరినా మమతా వారిని కనికరిస్తుందా లేదో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: