Email Us:
mahaatelugunews@gmail.com

నాగ చైతన్య అర్జునుడిగా.. కామెడీ టీజ‌ర్‌!

1-November-2018
చందూ మొండేటి, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా 'స‌వ్య‌సాచి'. ఈ సినిమా ప్ర‌పంచవ్యాప్తంగా శుక్రవారం విడుద‌ల కానుంది. ఈ నేపధ్యంలో సినిమాకి సంబంధించి జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది చిత్రబృందం. కొద్ది రోజులుగా చిత్రం నుండి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ కొద్దిసేప‌టి క్రితం సవ్య‌సాచి సుభ‌ద్ర ప‌రిణ‌యం పేరుతో కామెడీ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. సుబధ్ర పరిణయం నాటాకానికి సంబంధించిన ఈ టీజర్‌ హాస్యభరితంగా ఉంది.
ఇందులో నాగ చైతన్య అర్జునుడిగా కనిపించగా వెన్నెల కిశోర్‌ కృష్ణుడిగా కనిపిస్తున్నాడు. హైపర్‌ ఆది, సుదర్శన్‌, విధ్యుల్లేఖ రామన్‌, వైవ హర్ష ఇతర పౌరాణిక పాత్రల్లో న‌టించి కామెడీ సృష్టించారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక ముఖ్య నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ధియేటర్లలో పలకరించనుంది.