Email Us:
mahaatelugunews@gmail.com

రానా చెప్పేశాడు.. మీటూ వలనే!

1-November-2018
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాధించుకున్న రానా ప్రస్తుతం వరుస సినిమాలు హీరోగా చేస్తూనే ప్రత్యేక పాత్రలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఒక పక్క సినిమాలతో మరోప్రక్క రియాలిటీ షోలతో గడుపుతున్న రానా తాజాగా బాలీవుడ్‌లో ఓ క్రేజీ ఆఫర్ పట్టేశాడు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'హౌజ్ ఫుల్ 4' సినిమాలో రానా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని రానా స్వయంగా ప్రకటించాడు. హైద‌రాబాద్ వెలుప‌ల ప‌ని చేయ‌డం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దీని వ‌ల‌న కొత్త విష‌యాలు నేర్చుకుంటాం. హౌజ్‌ఫుల్ చిత్రం లాంటి జాన‌ర్‌లో నేనెప్పుడు పని చేయ‌లేదు. వినూత్నమైన చిత్రాల‌లో ప‌నిచేయ‌డం నాకు ఎంతో ఉత్తేజంగా ఉంటుందని రానా చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ఆ పాత్రను తొలుత నానాపటేకర్ చేయవలసి ఉండగా.. మీటూ ఉధ్యమంలో భాగంగా నటి తనుశ్రీదత్తా నానాపటేకర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు సాజిద్ ఖాన్‌పైచ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్ష‌య్ కుమార్ ఇటీవ‌ల హౌజ్ ఫుల్ 4 నిర్మాత‌ల‌కి ఫోన్ చేసి అనుమానితులుగా ఉన్న వారి విచార‌ణ పూర్త‌య్యే వర‌కు సినిమా షూటింగ్ నిలిపివేయాల‌ని కోరాడు. ఈ స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం అని పేర్కొనగా నటుడు నానాపటేకర్, దర్శకుడు సాజిద్ ఖాన్‌లను సినిమా నుండి తొలిగించారు.
ఇక వారి స్థానాల్లో రానా, ఫ‌హ‌ద్ సంజీ ఎంపికయ్యారు. ఇక సాజిద్ నడియాద్వాల నిర్మిస్తోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, బొమన్ఇరాని, చుంకీ పాండే, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతి ఖర్భంద, కృతి సనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.