Email Us:
mahaatelugunews@gmail.com

100 కోట్లు ఇస్తా.. కుక్కతో సెక్స్ చేస్తావా..!

3-November-2018
దేశవ్యాప్తంగా 'మీటూ' ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, దర్శకుడు సాజిద్ ఖాన్ తమను వేధించాడని నటీమణులు అహానా కుమ్రా, సలోనీ చోప్రా ఆరోపించారు. ఇప్ప‌టికే సాజిద్ ఖాన్ పై వ‌ర‌స‌గా హీరోయిన్స్ ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ఈ కార‌ణంతోనే అక్ష‌య్ కుమార్ కూడా త‌న హౌజ్ ఫుల్ 4 నుంచి ఈయ‌న్ని త‌ప్పించాడు. ఇక ఇప్పుడు మీటూ ఉద్యమంలో భాగంగా ఇద్ద‌రు హీరోయిన్లు సాజిద్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.
లిప్ స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా హీరోయిన్ అహానా కుమ్రా సంచ‌ల‌న ఆరోపణలు చేసింది. ఈమె మాట్లాడుతూ.. సాజిద్ గురించి త‌న‌కు ఎంతో మంది చెప్పార‌ని.. అయినా కూడా ఆయ‌న త‌న ఇంటికి రమ్మని పిలిచినప్పుడు.. మ‌రో దారి క‌న‌బ‌డ‌క‌ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. ఇక అక్కడికి వెళ్లిన త‌ర్వాత‌ సాజిద్ ఖాన్ తనను చీకటిగా ఉన్న ఓ గదిలోకి ఆయన తీసుకెళ్లాడని, బయట కూర్చుందామని తాను అడిగితే, అక్కడే ఉన్న వాళ్ల అమ్మకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడని తెలిపింది. త‌న‌తో కుల్లు జోకులేస్తూ నవ్వించేందుకు ప్రయత్నించాడని చెప్పింది. ఆయన ప్రవర్తనపై తనకు అనుమానం వచ్చి, తాను ఓ పోలీసు అధికారి కుమార్తెనని అబద్ధం చెప్పానని, అయినా, అతని వేధింపులు ఆగలేదని వెల్లడించింది. ముద్దు పెడితే డబ్బులిస్తానని ప్రారంభించిన అతని సంభాషణ, రూ. 100 కోట్లు ఇస్తా.. కుక్కతో సెక్స్ చేస్తావా అంటూ వికృత‌మైన వ్యాఖ్య‌లు చేసాడ‌ని ఆరోపించింది. అతని కోరిక తీర్చేందుకు తాను మొండిగా నిరాకరించానని, దీంతో తన గొంతు బాగాలేదని, అతిగా ఆలోచిస్తుంటానని చెబుతూ, ముఖ్యమైన పాత్రలకు దూరం చేశాడని ఆరోపించింది..
అచ్చంగా ఇవే క‌మెంట్స్ మ‌రో హీరోయిన్ కూడా సాజిద్ ఖాన్‌పై చేయ‌డం చిత్రం. స‌లోనీ చోప్రా అనే ముద్దుగుమ్మకు కూడా సాజిద్ ఖాన్‌తో అచ్చంగా ఇదే అనుభ‌వం ఎదురైంది. ఆమెను కూడా ఇంటికి పిలిపించుకుని సేమ్ డైలాగ్స్ కొట్టాడు సాజిద్. ఆమె కూడా త‌న సోష‌ల్ మీడియా పేజీలో ఈ వ్యాఖ్య‌లు షేర్ చేసుకుంది. మొత్తానికి ఇప్పుడు సాజిద్ ఖాన్‌పై రోజుకో ర‌కంగా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో ఈయ‌న కెరీర్‌కు దాదాపు పుల్ స్టాప్ ప‌డిన‌ట్లే క‌నిపిస్తుంది.