Email Us:
mahaatelugunews@gmail.com

మంచినీళ్లు తాగి.. 7లక్షల టిప్ ఇచ్చాడు.!

23-October-2018,America
ఏదైనా హోటల్‌కు వెళ్తే, అక్కడ లభించే ఆతిథ్యం, నచ్చిన ఆహారాన్ని బట్టి, కస్టమర్లు తోచినంత టిప్‌ను ఇచ్చి వెళతారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఈ టిప్ ఎంత భారీగా ఉంటుందో గతంలో ఎన్నో సందర్భాల్లో చూశాము. అటువంటిదే ఇది కూడా. హోటల్ కు వచ్చి కేవలం మంచినీరు తాగి వెళ్లిన ఓ వ్యక్తి, తనకు నీళ్లిచ్చిన యువతికి ఏకంగా 10 వేల డాలర్లు (సుమారు రూ. 7.38 లక్షలు) టిప్ ఇచ్చిన ఘటన నార్త్ కరోలినాలో జరిగింది.

ఓ హోటల్ లో అలియానా కస్టర్ అనే యువతి వెయిట్రెస్ గా పనిచేస్తోంది. ఆ హోటల్ కు వచ్చిన ఓ కస్టమర్ మంచినీరు కావాలని కోరగా, ఆమె నీరిచ్చింది. ఆ తర్వాత వెయిటర్ కస్టర్ మళ్లీ లోపలకి వెళ్లింది. మెనూ చూస్తు ఆ కస్టమర్ రెండు బుక్కల నీళ్లు తాగాడు. ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు ఆమె మళ్లీ టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చింది. వచ్చి చూసేసరికి ఆ టేబుల్ మీద వంద డాలర్ల నోట్లు కొన్ని కనిపించాయి. ఆ నోట్లను చూసి కస్టర్ స్టన్ అయ్యింది. వాటిని లెక్కపెట్టింది. అవి పదివేల డాలర్లు(సుమారు ఏడున్నర లక్షలు) ఉన్నట్లు ఆమెకు తెలిసిపోయింది. ఆ టేబుల్ మీదే ఉన్న ఓ న్యాప్‌కిన్‌పై అతను ఇలా రాసి వెళ్లాడు. రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఆ న్యాప్‌కిన్ పై రాశాడు. వెయిటర్ కస్టర్ అది చదివి షాకైంది. మరోసారి వచ్చిన అతను, ఆమెకు ఓ హగ్ ఇచ్చి వెళ్లాడు.

ఇక ఆ కస్టమర్ యూట్యూబ్ లో దాదాపు 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా, ఇప్పుడు ఆనందంలో ఎగిరి గంతేస్తోంది. ఈ రోజును తన జీవితంలో మరచిపోలేనని చెబుతోంది. తనతో పాటు పనిచేస్తూ, చదువుకునే స్తోమతలేని వారికి సాయం చేసేందుకు డబ్బును వినియోగిస్తానని చెబుతోంది. అప్పుడప్పుడు అతను గుర్తు తెలియని వ్యక్తులకు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుంటాడు. తాజాగా వెయిటర్ కస్టర్‌ను కూడా అతను తన టిప్‌తో థ్రిల్ చేశాడు. అయితే కస్టర్ తనకు వచ్చిన టిప్‌ను చూసి స్టన్ అయిన సందర్భాన్ని అతని టీమ్ వీడియో తీసింది. ఇలాంటి వీడియోలు అతని యూట్యూబ్ పేజీలో బోలెడున్నాయి. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉన్న గ్రీన్‌విల్లే సుప్ డాగ్స్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది.