Email Us:
mahaatelugunews@gmail.com

అంబులెన్స్‌‌లో అత్యాచారం..!

30-October-2018,Pakistan
పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఘోరాతి ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని 15 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై ప్రాణం పోయాల్సిన బాధ్యతాయుత వైద్య వృత్తిలో ఉన్న పారామెడికల్ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనలో అహ్సాన్ అలీ, సమీన్ హైదర్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నానకనా సాహీబ్ నగరంలో నివాసం ఉంటున్న ఓ మానసిక వికలాంగురాలు ఇంటి నుంచి బయటికివెళ్ళి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు కూడా గాలిస్తున్నారు. ఈ క్రమంలో వారికి నానకనా ప్రాంతంలోని బైపాస్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓ అంబులెన్స్ నుంచి అమ్మాయి అరుపులు వినిపించడంతో అక్కడికి వెళ్లి, అంబులెన్సు తలుపులు తెరిచి చూడగా నిందితులిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ కనిపించారు. బాలిక తల్లిదండ్రులను చూడగానే నిందితులు ఆమెను బయటకు విసిరేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితులిద్దరిని పాక్ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది.