Email Us:
mahaatelugunews@gmail.com

బాబుది నియంత పాలన

8-November-2018,andhra
మాజీ మంత్రి మాణిక్యాలరావు పై పోలీసులు ప్రవర్తన సరిగా లేదని బీజేపీ నేత జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు పరిపాలన నియంత పాలనన్నారు. బీహార్ లో లాలు రాజ్ లాగ ఏపిలో పోలీసు రాజ్ నడుస్తోందన్నారు. చంద్రబాబు ది చేతకాని ప్రభుత్వమన్న ఆయన అసలైన మావోయిస్టులను అడ్డుకోలేరు గాని మమ్మల్ని అడ్డుకున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రతిపక్షంలోకి వస్తారన్న సంగతి గుర్తు పెట్టుకోండని ఆయన సూచించారు. ఈ రోజు జరిగిన విషయాన్ని జాతీయ స్థాయి కి తీసుకెళతామని ఆయన హెచ్చరించారు.