Email Us:
mahaatelugunews@gmail.com

ఆర్జేడీ పోస్టర్ వార్..?

18-October-2018,Bihar
బీహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాలు... దసరా సందర్భంగా కొత్త యుద్ధానికి తెరలేపాయి. దసరాను పురస్కరించుకుని ఆర్జేడీ ఏర్పాటు చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను రావణాసురుడిగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా పోలుస్తూ పాట్నాలోని ఆర్జేడీ కార్యాలయం బయట పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లపై ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి ఫొటోలు కూడా ఉన్నాయి..

ఈ నెల 21 నుంచి తేజస్వీ యాదవ్ నాలుగో విడత ‘సంవిధాన్ బచావో న్యాయ్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ కార్యకర్త ఆనంద్ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, ఈ పోస్టర్లపై ‘రావణాసురుడు అత్యాచారాలకు పాల్పడిన ప్రతిసారీ రాముడు పుడుతూనే ఉంటాడు’ అనే స్లోగన్‌ను కూడా ముద్రించారు. దీంతో ఇప్పుడిది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బీహార్‌లో రోజురోజుకు పెరుగుతున్న అరాచకల్ని తేజస్వీ యాదవ్ అదుపు చయగలడని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం పోస్టర్‌ను తప్పుపడుతున్నాయి. సీఎం నితీష్‌ను రావణుడిగా చూపించడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి.