Email Us:
mahaatelugunews@gmail.com

మళ్లీ కాట్రగడ్డ ఫ్లెక్సీ కలకలం..!

6-November-2018,andhra
మరో సారి విజయవాడ నగరంలో ఫ్లెక్సీల కలకలం చెలిరేగింది.జనసేన పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ప్రశ్నలు ఎక్కుపెట్టారు. మీ సినిమా రాజకీయాలకు పనికిరాదని, మీరు మద్దతు ఇవ్వకపోతే 2014లో బాబు రిటైర్ అయ్యేవారా..అని ప్రశ్నించిన ఆయన పవన్ పై సామెతలు వదిలారు. 'నేను కూయందే తెలవదు అందంట ఓ అమాయకపు కోడి' అలా వుంది మీ తీరని ఆయన ఎద్దేవా చేశారు. ఎందుకీ అహంకారపు మాటలని, ఒక్కటి, రెండు సీట్లు వస్టే మీకు ఎక్కువే అన్నారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిస్తే 2009 లో వచ్చినివవి 18 సీట్లే అన్నారు. ఇప్పుడు తల్లకిందులుగా తపస్సు చేసినా మీకు ఒక్క సీటు వచ్చే అవకాశాలు లేవన్నారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బాబు సీఎం కావడం తథ్య అని కాట్రగడ్డ బాబు ఫ్లెక్స్ లో పేర్కొన్నారు. నగరంలో పలు ప్రాంతాలలో పాటు వెలగపూడి ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారాయి.. ఫ్లెక్స్ లు.