Email Us:
mahaatelugunews@gmail.com

రెండవ టీ20 వర్షార్పణం..

23-November-2018,Telangana
భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20 రద్దైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే. వర్షం కారణంగా ఆట రద్దవ్వడం అభిమానులను నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 19 ఓవర్లకు 132/7తో నిలిచింది. వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కోహ్లీసేన లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 137కు సవరించారు.