ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌కు షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

ట్విట్టర్ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు దెబ్బ మీద దెబ్బ వేస్తూ వరుస షాక్‌లను ఇస్తుంది. వారి వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్‌ను తొలగిస్తూ సంచలనంగా వార్తల్లో నిలుస్తోంది ఇటీవల వెంకయ్య నాయుడి ట్విట్టర్‌ ఖాతా బ్లూ టిక్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ట్విట్టర్. తాజాగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌ ట్విట్టర్‌ ఖాతాకు బ్లూటిక్‌ను తీసేసింది.

ట్విట్టర్ యాజమాన్యం ఇలాంటి దురుసు నిర్ణయాలకు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ట్విట్టర్ యాజమాన్యాన్ని సంప్రదించాలనుకుంటున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ తోపాటు సురేష్ భయ్యాజీ జోషి గోపాలకృష్ణ అరుణ్ కుమార్ సురేష్ సోనీ ల ట్విట్టర్ అకౌంట్లకు బ్లూ టిక్ ను తొలగించింది ట్విట్టర్. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది బీజేపీ సర్కార్. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: