ఆఫర్ల వేటలో అనన్య

Google+ Pinterest LinkedIn Tumblr +

మల్లేశం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది తెలుగు హీరోయిన్ అనన్య నాగల్ల. మల్లేశం చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆఫర్ల కోసం చూస్తున్న తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో నటించే ఛాన్స్ తన్నుకొచ్చింది. దీంతో ఈ అమ్మడు ఎగిరిగంతేసినంత పనైంది. ఇక మొత్తానికి వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించింది ఈ భామ.

నటించిన రెండు సినిమాలే అయినా పాత్రలు మాత్రం గ్లామర్ కు దూరంగా ఉన్నాయి. అయినా తన నటనతో మెప్పించాలని ప్రయత్నిస్తోంది అనన్య. వకీల్ సాబ్ చిత్రం కూడా బంపర్ హిట్ కొట్టడంతో మంచి జోష్ మీదుంది ఈ హీరోయిన్. ఇక కొత్త చిత్రాల్లో అవకాశాల కోసం అందాల విందు చేస్తూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తన అందంతో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది. గ్లామరస్ లుక్స్, చీర కట్టుతో ఫోటో షూట్ బాట పట్టింది ఈ తెలుగు హీరోయిన్. ఇక దీంతోనైనా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి మరి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: