ఆ క్షణమే రాజీనామా చేస్తా

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటక సీఎం యడియూరప్ప వివాదం గంట గంటకు కొత్త మలుపులు తిరుగుతోంది. కొన్ని రోజులు నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని పార్టీ నేతలు అనుకుంటున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

దీంతో ఈ అంశంపై తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పందిస్తూ.. పార్టీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందని, ఎట్టిపరిస్థితుల్లో యడియూరప్పను తొలిగించే అవకాశాలు లేవని, అవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి యడియూరప్ప సైతం దీనిపై స్పందించారు. బీజేపీ అగ్రనాయత్వం ముఖ్యమంత్రి పదవి నుంచి వదిలి వెళ్లిపోమంటే ఆ క్షణమే తప్పుకుంటానని తెలిపారు సీఎం యాడియూరప్ప.

Share.

Comments are closed.

%d bloggers like this: