తెలంగాణలో భారీగా తగ్గుతున్న కరోనా

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల భారీగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ పుణ్యమా అంటూ కేసుల సంఖ్య తగ్గుతూ దేశ ప్రజలకు కాస్త ఉపశమనం కల్గిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కేసులు విపరీతంగా పెరగడంతో గతంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ మంత్రాన్ని జపించాయి.

దీంతో కేసుల తగ్గుదల అమాంతంగా తగ్గాయి. ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 97,751 మంది పరీక్షలు చేయగా అందులో కేవలం 1,436 పాజిటివ్ కేసులు నమోదవ్వట విశేషంగా చెప్పవచ్చు. జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్ ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,00,636 కేసులే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కొన్ని సడలింపులతో లాక్ డౌన్ ను ఎత్తేసే పనిలో ఉన్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: