ఈటలకు స్పీకర్ షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల రాజేందర్ కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. గత రెండు మూడు రోజుల నుంచి టీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నానంటూ ఈటల ప్రకటించారు. అదే విషయంపై స్పీకర్ ను అపాయింట్ మెంట్ కోరగా దానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరాకరించారని తెలుస్తోంది.

దీంతో ఈటల వర్గం నేతలు టీఆర్ఎస్ మంత్రులు కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. పలు మార్లు ఫోన్ చేసినా స్పందించకపోవటం కావాలనే చేస్తున్నారని ఈటల వర్గం పెద్దలు చెబుతున్నారు. ఇక స్పీకర్ మాత్రం కరోనా కారణంగా అపాయింట్ మెంట్ ఇవ్వలేమని, కరోనా తగ్గాకే చూస్తామన్నట్లు సమాచారం.

దీంతో ఈటల అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో నేరుగా నైనా లేక ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఈటల బీజేపీలో చేరనున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: