ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ హంగామా

Google+ Pinterest LinkedIn Tumblr +

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ గత కొన్నేళ్ల నుంచి నడుస్తున్న వార్త. స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా తనకంటూ ఓ అభిమాన్ని సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇటు సినిమాల్లోనూ తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు ఈ యంగ్ డైనమిక్ హీరో. సినిమా వేదికలపై మంచి మెసేజ్ తో కూడిన ప్రసంగాలు చేస్తుంటాడు ఎన్టీఆర్.

దీంతో తన ఫ్యాన్స్ కే కాకుండా ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటాయి ఆయన ప్రసంగాలు. దీంతో తన ఫ్యాన్స్ రాజకీయాల్లోకి రావాలంటూ చాలా రోజుల నుంచి కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి. దీంతో పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే ఒక ఎన్టీఆర్ తోనే సాధ్యమని ఏకంగా టీడీపీ నేతలు బహిరంగంగా చాలా సార్లు చెప్పుకొచ్చారు.

దీంతో తాజాగా ఎన్టీఆర్ అభిమానులు కుప్పంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి తనపై ఉన్న అభిమానాన్ని తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కుప్పంలో భారీ ప్లేక్సీలు ఏర్పాటు చేశారు . జనవరిలో చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి సైతం తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై పెదవి విప్పని ఎన్టీఆర్ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: