తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ పొడిగించాలా లేక సడలింపులతో కూడిన లాక్ డౌన్ ను కొనసాగించాలా అని అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా గతంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సమయం ఇచ్చి మిగతా సమయంలో లాక్ డౌ న్ ను విధించింది ప్రభుత్వం.

ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఉదయం 10 కాస్త 2 గంటల వరకు పెంచి సడలింపులు ఇచ్చారు. ఇక జూన్ 9 తేదీలోపు లాక్ డౌన్ కాలం పూర్తవుతుండటంతో లాక్ డౌన్ ను ఎత్తేసే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాత్రి 7 గంటలు లేదా 9 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలను అనుమతించి, రాత్రి 8 లేదా 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం లాక్‌డౌన్‌ ఎత్తివేత, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: