ధూళిపాళ్ల నరేంద్రపై మరో కేసు

Google+ Pinterest LinkedIn Tumblr +

సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రపై తాజాగా మరోకేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కారని పటబట పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలోని ఓ స్టార్‌ హోటల్‌లో మే 29న సంగం డెయిరీ పాలక వర్గ సమావేశం కర్ఫ్యూ, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించారని పటమట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కిశోర్‌ కుమార్‌ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టారు.

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన నరేంద్ర షరతుల ప్రకారం విజయవాడలోనే ఉంటున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, సిరిమల్లెల రాజేంద్రప్రసాద్‌, గోపాలకృష్ణతోపాటు మొత్తం 20 మందిపై కేసు నమోదు అయింది. కాగా, సమావేశంలో తాము 12 మంది మాత్రమే పాల్గొన్నామని సంగం డెయిరీ ప్రతినిధులు చెబుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: