జులై 8న షర్మిల పార్టీ ప్రకటన

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి సంచలనం క్రియేట్ చేసింది వైఎస్ షర్మిల. తెలుగు రాజకీయాల్లో అలుపెరుగుని నేతగా రాజకీయాలను ఏలిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా ప్రజల్లోకి అడుగుపెట్టబోతోంది షర్మిల. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటుంది షర్మిల. పార్టీ కూడా పెట్టబోతున్నానంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీ పేరు ప్రకటనకు కూడా అంతా సిద్ధమైందట.

వైఎస్పార్ జయంతి సందర్భంగా పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు తెలిపారు ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్. జులై 8న కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో తెలంగాణ రాజకీయాల్లోకి మరో పొలిటికల్ పార్టీ అవతరించబోతోంది. ఇక షర్మిల తన కొత్త పార్టీని ‘వైఎస్సార్ టీపీ’గా రిజిస్ట్రేషన్ చేయించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: