చికిత్సతో పాటు ఆర్థికసాయం అందించాలి-భట్టి

Google+ Pinterest LinkedIn Tumblr +

గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ ఫంగస్, కరోనా వైద్యం ఉచితంగా ప్రభుత్వం అందించాలని కాంగ్రేస్ నేతలు దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనా మరణాలకు సీఎం కేసీఆరే కారణమంటూ భట్టి మండిపడ్డారు. కరోనా ఆరోగ్య శ్రీలో చేర్చాలంటుంటే ప్రభుత్వం మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. బ్లాక్ ఫంగస్, కరోనా వంటి చికిత్సలను ప్రభుత్వమే ఉచితంగా అందించటంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాలన్నారు భట్టి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: