కారెక్కనున్న ఎల్.రమణ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాజకీయాల్లో టీడీపీ రాను రాను కనుమరుగువుతోంది. ఇక తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా కనిపించటం లేదు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్కడక్కడ పోటీ చేసినా ఎక్కడ కూడా ఒక్క స్థానాన్ని రాబట్టుకోలేకపోయింది. ఉన్నకొద్ది మంది నేతలు కూడా పక్క పార్టీలోకి జంప్ అయ్యారు.

ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నాడు. దీంతో తాజాగా ఆయనను టీఆర్ఎస్ లోకి రావాలంటూ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో ఆయనకు ఫోన్లు సైతం చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. మా పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామంటూ ఆఫర్ సైతం ఇచ్చినట్లు టాక్. మరి ఇంతకు ఎల్.రమణ టీఆర్ఎస్ లోకి వెళతారో లేదో చూడాలి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: