మరుగుదొడ్లు కావాలంటూ అర్ధనగ్న ప్రదర్శన

Google+ Pinterest LinkedIn Tumblr +

నెల్లూరు జిల్లా సంగంలో స్మశాన వాటిక, బస్టాండ్ లో మరుగుదొడ్లు కావాలంటూ జననీ సేవ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పలు దుకాణాల్లో బిక్షాటన చేస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..సంగం కేంద్రంలో ఉన్న 15 ఎకరాల స్మశానవాటిక కబ్జా కొరల్లో చిక్కుకుని నేడు రెండు సెంట్ల భూమి మాత్రమే మిగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో చనిపోయిన వారిని స్మశానాల్లో పూడ్చిపెట్టేందుకు సెంట్ భూమిలేదంటూ వాపోయారు. ఈ అంశంపై పలుమార్లు అధికారులను కలిసి వివరించినా ఎవరూ స్పందించడం లేదంటూ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోజననీ సేవ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: