ఆగస్టులో సెట్స్ పైకి పవన్ హరీష్ సినిమా

Google+ Pinterest LinkedIn Tumblr +

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాతో రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా ఈ మూవీ ఓ మైలురాయిగా చెప్పవచ్చు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు రాబోతోందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గతంలోనే పట్టాలెక్కుతుందనుకున్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో వీరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ తో హరిహరవీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు కూడా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఒకవేళ తొందర్ల లాక్ డౌన్ ఎత్తేస్తే ఈ రెండు సినిమాలు తొందరగా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాలో నటించే అవకాశం ఉంటుందని ఫిల్మ్ నగర్ లొ టాక్.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: