రఘురామ లేఖపై స్పందించిన ఒడిశా ఎంపీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారంపై దేశంలోని ఎంపీలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. సీబీఐ అధికారులు నన్ను కొట్టారంటూ దేశంలోని ఎంపీలందరకీ లేఖ రాశారు ఎంపీ రఘురామరాజు. ఈ అంశంపై దేశంలోని ఎంపీలు కొందరు ఆయనకు మద్దతు తెలుపుతు సానుభూతి తెలియజేస్తున్నారు.

గతంలో మండ్యా ఎంపీ సుమలత, కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్ సహా మరికొంత మంది ఆయనకు మద్దతును కూడగట్టారు. తాజాగా ఒడిశాలోని పూరి ఎంపీ బిజూ జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నేత పినాకి మిశ్రా రఘురామకు మద్దతు తెలిపారు. సీఐడీ అధికారులు రఘురామపై దాడిని తీవ్రంగా ఖండించారు. గాయాలతో కూడిన ఫోటోలు దిగ్బ్రాంతికి గురి చేశాయన్నారు. ఇక దీనిపై తప్పకుండా పార్లమోంట్ లో ప్రస్తావిస్తామన్నారు పినాకి మిశ్రా.

Share.

Comments are closed.

%d bloggers like this: