ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. ఏపీలోని ఇళ్ల పట్టాలు, వాటికి కావాల్సిన మౌలిక వసతుల గురుంచి ప్రధాని నరేంద్రమోడీకి లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచామని 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వాటి మౌలిక వసతులకు కోసం రూ.50,944 కోట్లు ఖర్చు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. దీంతో వాటి ఖర్చు మాకు భారంగా మారిందని ఏపీని ఆదుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు సీఎం. ఇక వీటి ఖర్చు నిమిత్తం పీఎంఏవై కింద రూ. 34 వేల కోట్లు ఏపీకి అందించాలని ప్రధానిని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.

Share.

Comments are closed.

%d bloggers like this: