గుణశేఖర్ ప్రతాపరుద్రుడు..హీరో ఎవరంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

చరిత్రలో దాగిన పౌరాణిక కథలను తన రచన ద్వారా లోతైన విశ్లేషణ ఇవ్వగల నేర్పును పసిగట్టాడు దర్శకుడు గుణశేఖర్. ఈ కాలంలో ఎక్కువగా నడుస్తున్న చిత్రాలు కూడా ఇవే అని చెప్పాలని. తెలుగు చిత్ర పరిశ్రమలో పౌరాణిక గాథలను తెరపై చూపించేందుకు టాలీవుడ్ దర్శకులు ఎవరి దారిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రోటిన్ కథ కాకుండా దాని చారిత్రక పాత్రలను విభిన్నమైన శైలీలో చూపించేందుకు డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు.

రాజమౌళి, క్రిష్, గుణశేఖర్ వంటి అగ్రదర్శకులు ఈ దారిలోనే వెలుతున్నారు. ఇక గుణశేఖర్ విషయానికొస్తే గతంలో రుద్రమదేవి సినిమాతో కాకతీయుల చరిత్రను తెరపై చూపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇక మరోసారి ఇలాంటి కథతో సిద్ధమతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రతాపరుద్రుడు అనే టైటిల్ తో ఓ సినిమా చేయనున్నాడని టాక్. ఈ మూవీలో హీరోగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు గుణశేఖర్ చేతిలో శాకుంతలం అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. దీంతో ప్రతాపరుద్రుడు మహేష్ బాబుతో ఎప్పుడు పట్టాలెక్కనుందని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: