కారు స్పీడ్ కు బ్రేకులు..ఈటల ఇలాకాలో షాక్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటల ఇలాకా నుంచి టీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన రాజీనామా చేస్తున్నారని తెలుసుకున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా రాజీనామా పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

ఈటలతోనే మేముంటామంటూ వీణవంక మండలానికి చెందిన 7 గ్రామాల సర్పంచ్‌లు, వైస్‌ ఎంపీ పీ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక 12 గ్రామాల టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రాజీనామాలు చేశారు. ఇక ఈటల రాజేందర్ సైతం పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: