మా ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు లేవు-యోగి

Google+ Pinterest LinkedIn Tumblr +

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ప్రభుత్వంలో కీలక మార్పులు రాబోతున్నాయంటూ గత కొన్ని రోజులుగా ఓ వర్గం మీడియా కోడై కూస్తోంది. ఇక యూపీ ప్రభుత్వంలో కొన్ని కీలకమైన అంశాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉందన్న వార్తలపై అలెర్ట్ అయిన సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు.

మా ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు రాబోవడం లేదని అంతా సక్రమంగానే ఉందని తేల్చి చెప్పారు. త‌ను ఎంపీగా ఉన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి కావాల‌నే టార్గెట్ పెట్టుకోలేదని త‌న ప్ర‌భుత్వంలో ఎవ‌రూ వేలు పెట్ట‌లేరంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక వేరే ప‌ద‌వుల విష‌యంలో త‌ను ప్ర‌త్యేకంగా టార్గెట్ పెట్టుకోవ‌డం లేద‌ని, జ‌రిగేది జ‌రుగుతుంద‌న్న‌ట్టుగా యోగి ఆదిత్య‌నాథ్ స్పందించారు. ఇది గాక తాజాగా ప్రధాని మెడీ, యోగి ఆదిత్య‌నాథ్ మధ్య విభేదాలు కూడా తారా స్థాయికి చేరాయన్న వార్తలు సైతం ఊపందుకున్నాయి.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: