ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అప్పుడేనట?

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇక మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

దీంతో ఈ చిత్రాన్ని మొదటగా ద‌స‌రా కానుకగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడడంతో విడుదల తేదీపై అనుమానాలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ కంప్లిట్ చేయాలంటే కొద్ది కాలం పడుతుండడంతొ ఏప్రిల్ 28, 2022లో ‘ఆర్ఆర్ఆర్‌’ను విడుద‌ల చేస్తామ‌ని జ‌క్క‌న్న యూనిట్‌కు చెప్పినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌, కోలీవుడ్‌కి చెందిన స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: