పెళ్లికి నో చెప్పిన శ్రుతిహాసన్

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రుతిహాసన్ తెలుగు, తమిళ్ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం అవకాశాలు దక్కించుకుంటుంది ఈ హీరోయిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో తన రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమా హిట్ కొట్టడంతో ఈ భామాకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.

అటు నటన ఇటు గాయనిగా రెండు రంగాల్లో దూసుకెళుతోంది శ్రుతిహాసన్. సోషల్ మీడియాను బాగా పలకిరించే ఈ అమ్మడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ లోకి వచ్చి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక కొంతమంది అభిమానులు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతు కొంపముంచినంత పని చేశారు.

ఒక నెటిజన్ అడుగుతూ..మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలని అడగ్గా.. అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో చెప్పింది. ఒకతను ఏకంగా నన్ను పెళ్లి చేసుకంటావా అని అడగగా ఒక్కసారిగా షాక్ గురై నో అని చెప్పింది. ఇక ప్రస్తుతం శ్రుతిహాసన్ ప్రభాస్ తో సలార్ చిత్రంలో లో నటిస్తుంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: