వేడెక్కిన హుజురాబాద్ రాజకీయం

Google+ Pinterest LinkedIn Tumblr +

హుజురాబాద్ రాజకీయం రోజు రోజుకు కొత్త పరిణామాలకు వేదికగా మారబోతుందా అంటే? అవుననే సమాధానాలు వినిపిస్తుున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల ఇక కారు దిగుతుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం అనివార్యమైన వేళ హుజురాబాద్ రాజకీయాలు కొత్త రంగును పులుముకుంటున్నాయి.

నేడో రేపో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనుండడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంకానుంది. దీంతో ఇక్కడ ఈటలకు పోటీగా టీఆర్ఎస్ నుంచి గట్టి అభ్యర్ధిని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఓ సరికొత్త పరిణామాలకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈటల బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపు సులభం కానుందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకటం లేదు. చూడాలి మరి ఉప ఎన్నిక వరకూ ఇక్కడి రాజకీయాలో ఎలా మారబోతున్నాయో.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: