సమంతా మరోవెబ్ సిరీస్ చేయనుందా?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంతా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో అగ్రకథనాయికగా నిలుస్తుంది సామ్. తాజాగా ది ‘ఫ్యామిలీ మేన్’ సీజ‌న్‌2లో నటించి తన సత్తా ఏంటో మరోసారి ప్రేక్షకులకు చూపించింది. దీంతో విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటోంది సమంతా.

తాజాగా విడుదలైన ఈ వెబ్ సిరీస్ లో తీవ్రవాద పాత్రలో నటించి నట విశ్వరూపాన్ని చూపించింది ఈ అక్కినేని కోడలు. ఇదిలా ఉండగా మరోసారి వెబ్ సిరీస్ లో సమంతా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మ‌రో ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ స‌మంత‌తో వెబ్ సిరీస్ చేయాల‌నుకుంటున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే మరోవెబ్ సిరీస్ చేయనుందా అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: