ఆ నిర్ణయంతో ఆయన బలహీనపడ్డారు-జీవన్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ఇక ఈటల చేరికను కొందరు బీజేపీకి అనుకూలంగా మాట్లాడితే మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈటల పార్టీ మార్పు గురించి స్పందించారు. ఈటల బీజేపీలో చేరిక నిర్ణయంతో ఆయన పూర్తిగా బలహీనపడ్డారని అన్నారు జీవన్ రెడ్డి. ఇక కేసీఆర్ తో సమానంగా పని చేసిన ఈటల తన సొంత నియోజకవర్గంలో స్వతంత్రంగా పోటీకి దిగితే 50 వేల ఓట్లకు పైగా మెజార్టీ వస్తుందని తెలిపారు జీవన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈటల బీజేపీలో చేరుతారని నేను ఊహించలేదన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: