చోక్సీ అరెస్ట్ పై ప్రియురాలు సంచలన కామెంట్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

వజ్రాల వ్యాపారీ మెహుల్‌ చోక్సీ వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని విదేశాలకు పారిపోయి జల్సాలు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన డొమినికాలో పట్టుపడ్డాడని ఆయనను భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇక అంటిగ్వా నుంచి అదృశ్య‌మైన వ‌జ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీ డొమినికాలోని తన ప్రియురాలైన బార్బరా జరాబికాను కలవటానికి వెళ్లి ఆ తర్వాత అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రియురాలు కావాలనే పోలీసులకు అప్పిగించాలని ప్రయత్నం చేసిందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఇలాంటి వార్తలపై స్పందించింది చోక్సీ ప్రియురాలు బార్బరా. చోక్సీ నాతో స్నేహం చేశాడని, తనను ఇష్టపడుతున్నానని చెప్పాడని తెలిపింది. దీంతో పాటు నాకు బహుమతులుగా వజ్రపుటుంగరాలు, బ్రేస్‌లెట్‌లు ఇచ్చాడు. అవన్నీ నకిలీవే అని తెలిపింది. దీంతో నాకు ఆయనకు గొడవైందని ఆయన అరెస్ట్ విషయంలో నా పాత్ర లేదంటూ తెలిపింది బార్బరా జరాబికా.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: