ఈటల మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం-షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళుతున్నారని వస్తున్న వార్తలు తెలిసిందే. దీంతో తెలంగాణలోని కొన్ని పార్టీలు ఆయనను చేర్చుకునేందుకు చర్చలు సైతం జరిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు ఈటలతో చర్చిలు జరిపినట్లు తెలిసిందే.

ఇక తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీని పెట్టబోతున్న షర్మిల ఈటల తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో సమావేశమైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారట, ఆయన కేసులకు భయపడే బీజేపీలోకి వెళుతున్నారని ఆమే తెలిపింది. ఇక ఈటల రాజేందర్ తమ పార్టీలోకి వస్తే వద్దంటామా అని అన్నారట. ఇక రేపో మాపో ఈటల బీజేపీలో చేరనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: