కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఈటల

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. కేసీఆర్ మంత్రి వర్గంలో రెండు మంత్రి శాఖల్లో పనిచేసిన ఈటల భూ కబ్జా ఆరోపణలు లేవనెత్తడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరి కాస్త పార్టీ మారే స్థాయికి చేరుకుంది.

ఇక మొత్తానికి ఈటల పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతుండడం దాదాపు ఖాయమనే చెప్పాలి. దీంతో నేడు తన నియోజకవర్గంలోని సమస్యలపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.

ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా వరాలు కురిపించే సీఎం హుజురాబాద్‌కు విరివిగా నిధులు, పనులు మంజూరు చేయాలని ఈటల డిమాండ్‌ చేశారు.ఇక తన రాజీనామాతో సీఏం కొత్త రేషన్ కార్డు మంజూరు చేశారని రెండేళ్లుగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లు, తెల్లరేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని అన్నారు ఈటల.

Share.

Comments are closed.

%d bloggers like this: