తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్

Google+ Pinterest LinkedIn Tumblr +

డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అన్ని స్థాయిలోని పోలీసు సిబ్బందికి ఇంటి రుణపరిమితిని పెంచుతూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన భద్రత– ఆరోగ్య భద్రత ట్రస్ట్‌ బోర్డు మీటింగ్‌లో డీజీపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటు రుణాల వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్ని హోదాలో ఉన్నవారి పిల్లల విదేశీ విద్యా రుణాల్లో రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకన్నారు. ఈ నిర్ణయంతో పోలీసుల ఇళ్ల నిర్మాణానికి కొంచెం వెసులుబాటనే చెప్పాలి. దీంతో తెలంగాణ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: