రేపు ఢిల్లీకి ఏపీ సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే రెండు మూడు రోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో రేపు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. పోలవర ప్రాజెక్ట్ పనులు, మూడు రాజధానుల అంశం వంటి వాటిపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా పరిపాలనకు సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు, వాటి నిధులు గురించి కూడా ప్రస్తావించనున్నారని తెలుస్తుంది. అయితే ఇంతకు ముందుకు జగన్ ఢిల్లీ టూర్ పెద్దలు అపాయింట్ మెంట్ కారణంగా వాయిదా పడిందన్న వార్తలు వచ్చాయి, ఇక రేపు జగన్ ఢిల్లీ పర్యటన కొంచం ఆసక్తికరంగానే ఉంది.

 

Share.

Comments are closed.

%d bloggers like this: