క్లాస్ లుక్ లో బాలకృష్ణ

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే ఓ రేంజ్ అంచనాలుంటాయి. గతంలో వీరిద్దరు కలిసి చేసిన సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరి కలయికలో సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

గతంలో బోయపాటి బాలయ్యతో సింహా, లేజండ్ వంటి సినిమాలు చేసి బంపర్ హిట్ ను అందుకున్నారు. ఇక మరోసారి బాలయ్యతో బోయపాటి అఖండ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇక విషయానికొస్తే రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో అఖండ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో హీరో బాలయ్య లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. క్లాస్ లుక్ దర్శనిమిస్తూ యంగ్ గా కనిపిస్తన్నాడు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: