రంగారెడ్డి జిల్లాకు నేడు వైస్ షర్మిల

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు వైఎస్ షర్మిల. జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోటస్ పాండ్ బిజీ బిజీగా ఉంది. ఇక నేడు రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు షర్మిల. పరిగి నియోజకవర్గంలోని ఐకేపీ సెంటర్‌ను పరిశీలించనున్నారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఆ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో రోడ్డుపై తగలబెట్టారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలో షర్మిల ఆ రైతులతో భేటీ అయి ఆ అంశానికి సంభందించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: