తారక్‌తో ఉప్పెన డైరెక్టర్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌లో ఈ మధ్య విడుదలైన ఉప్పెన సినిమా విజయం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రం కథా, కథనం బలంగా ఉండటంతో అనుకోని విజయం సాధించింది. దీంతో ఆ చిత్ర డైరెక్టర్ బుచ్చిబాబు సాన తర్వాత వచ్చే సినిమా గురించి టాలీవుడ్‌లో అంతా ఆసక్తిగా మారింది. ఇక బుచ్చిబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని చేయనున్నాడనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

దీంతో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత మరికొన్ని చిత్రాలు చేసేందుకు రెడీగా ఉండటంతో ఇప్పట్లో బుచ్చిబాబుతో సినిమా చేసేటట్టు లేదని తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ప్రత్యేకమైన కథను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంతకు వీరిద్దరి ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: