హుజురాబాద్ ఉప ఎన్నికపై షర్మిల ఫోకస్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాజకీయాల్లోకి రాజన్న రాజ్యం కావాలంటూ అడుగుపెట్టింది స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల. ఇక పార్టీ సైతం పెట్టబోతుండడంతో తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీలో తన అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఏం చేయలేని షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందంటూ కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్న మాట.

 

ఏదేమైన ఓ నూతన రాజకీయ పార్టీ పెట్టడం అనివార్యమైన వేళ తెలంగాణ రాజకీయాల్లో ఓ చర్చ మాత్రం బలంగా జరుగుతోంది. ఇక విషయానికొస్తే పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే భావనతో అన్ని జిల్లాల నేతలతో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనుండడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తెర వెనక మంతనాలు జరుపుతున్నాయి. ఇక షర్మిల కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారని పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ హుజురాబాద్ ఎన్నికల్లో పోటీకి దిగితే గనుక గెలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ముందు టీఆర్ఎస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే.

దీంతో ఇక్కడ పోటీ టీఆర్ఎస్‌కు ఈటలకు మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగనుంది. ఈ క్రమంలో షర్మిల పార్టీ ఉనిఖీని తెలంగాణ వ్యాప్తంగా తెలుపేందుకు మాత్రం బాగా కలిసోస్తుందనే చెప్పాలి. ఇక రానున్న ఉప ఎన్నికల్లో షర్మిల ఎలా ముందుకు వెళాతారా చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: