ఆయన డైరెక్షన్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. యుక్త వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తున్నాడు ఈ నందమూరి నటసింహం. ఇక వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలను సైతం వెనక్కి నెట్టేస్తున్నాడు బాలకృష్ణ. ఇదిలా ఉండగా ఆయన తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త తాజాగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

దీంతో మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు టాలీవుడ్ దర్శకులు క్యూలో ఉన్నారట. దీంతో నందమూరి అభిమానులు మాత్రం ఆయన ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞకు సినిమాలపై అంతగా ఆసక్తిగా లేదంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

దర్శకుడు ఎవరనే వార్తలో మాత్రం ఒక కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే చిత్రానికి బాలకృష్ణనే డైరెక్ట్ చేస్తారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. గతంలో తనకి సూపర్ హిట్ ఇచ్చిన ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాలనీ, ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంభందించిన వార్తను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: