సీఎం యోగిపై అసంతృప్తి రాగాం

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలోని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులపై సొంత నేతలే వ్యతిరేక స్వరం వినిపిస్తూ రాజకీయల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని గత కొన్ని రోజుల నుంచి వార్తలు ఓ రేంజ్‌లో ఊపందుకున్నాయి. యూపీ ప్రభుత్వంపై జోరుగా వినిపిస్తున్న అసంతృప్తి రాగాల వల్ల ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయన్న వాదన కూడా ఓ వైపు బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి హుటాహుటిన గురువారం ఢిల్లీకి చేరుకుని బీజేపీ కేంద్రమంత్రి అమిత్‌ షాతో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులతో పాటు, మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికల ఫలితాల పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) బిఎల్‌ సంతోష్, మరికొందరు నేతలు యూపీలో పర్యటించి రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి ఒక నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదిక పూర్తి సారాంశాన్ని ప్రధాని మోదీకి నడ్డా, బీఎల్‌ సంతోష్‌ కు వివరించారట. ఇక వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

 

Share.

Comments are closed.

%d bloggers like this: