బ్యాటరీ సైకిల్..ఒక్కసారి ఛార్జింగ్ పెడితే

Google+ Pinterest LinkedIn Tumblr +

మనం మాములుగా బ్యాటరీతో నడిచే టూ వీల్లర్ బైక్‌లు, ఎలక్ట్రిక్ బస్సులను చూశాం. కానీ..బ్యాటరీతో నడిచే సైకిల్‌ను ఎప్పుడైనా చూశారా?. అవును మీరు విన్నది నిజమే. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మణికంఠ అనే విద్యార్థి బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. చేనేత కుటుంబానికి చెందిన మణికంఠ లాక్ డౌన్ సమయంలో ఏదో ఒకటి చేయాలన్నా తపనతో సొంత ఆలోచనతో బ్యాటరీ సైకిల్ తయారు చేశాడు.

4 బ్యాటరీలు, లైట్ ఎక్స్ లెటర్ సహాయంతో దీనిని తయారు చేశాడు. ఇక ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాలుగు గంటల పాటు 25 కిలోమీటర్ల పైగా ప్రయాణించవచ్చట. దీంతో సైకిల్ మొత్తం పూర్తవడానికి రూ. 10 వేల రూపాయలు ఖర్చు అయిందని అంటున్నాడు. నేటి పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు పెట్రోల్ రేట్లు భారీగా పెరగడంతో తల్లిదండ్రులు ద్విచక్ర వాహనం కొనియలేని పరిస్థితి ఉండడంతో బ్యాటరీ సైకిల్ తయారు చేశానని అంటున్నాడు విద్యార్థి మణికంఠ.

Share.

Comments are closed.

%d bloggers like this: